అలోవెరాతో ఎన్ని లాభాలో తెలుసా..!!

SMTV Desk 2018-04-30 17:59:29  ALOVERA, ALOVERA USEA, OTHERS, HEALTH TIPS.

హైదరాబాద్, ఏప్రిల్ 29 : అలోవేరా(కలబంద) ను ముఖానికి రాసుకుంటే ఎన్నో లాభాలు. తలకు పట్టిస్తే వేడి తగ్గుతుంది.. ఇంకా అలవేరా వల్ల కలిగే లాభాలేంటంటే.. >> అలోవెరా జ్యూసును రాత్రిపూట ముఖానికి రాసుకొని ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా రోజు చేస్తే చర్మసౌందర్యం మెరుగవుతుంది. >> అలోవెరాను శుభ్రంగా కడిగి.. తొక్కతో పాటు మిక్సిలో రుబ్బుకుని పేస్టులా ముఖం, చేతులు, కాళ్లు, మెడకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే.. చర్మం మెరుస్తుంది. చర్మ వ్యాధులు నయమవుతాయి. >> అలోవెరా జ్యూసూను తలకు పట్టిస్తే చుండ్రు సమస్యలు తొలిగిపోవడమే కాకుండా వేడి తగ్గుతుంది. >> అలోవెరా ముఖంపై ముడతలకు చెక్ చెబుతుంది. అలోవెరా జెల్, కొబ్బరి నూనె సమానంగా పట్టిస్తే.. కురులు అందంగా కనిపి౦చడమే కాదు మెరుస్తాయి కూడా.