రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

SMTV Desk 2018-04-30 17:54:51  Nizamabad District, Road accident, 4 membars, death

డిచ్‌పల్లి, ఏప్రిల్ 30: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట కారును లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలానికి చెందిన రాఘవేందర్‌(36), దీప్తి(34) దంపతులు తమ తేజస్‌ (10), సిగ్న(4)తో కలిసి కారులో హైదరాబాద్‌ నుంచి కోటగిరి వెళ్తున్నారు. నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న ఓ లారీ డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌ సమీపంలో వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రాఘవేందర్‌, దీప్తితో పాటు ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.