సచివాలయ సందర్శనకు ఆధార్

SMTV Desk 2018-04-30 17:12:44  secretariat amaravathi, aadhar, issued, pass

అమరావతి, ఏప్రిల్ 30: సచివాలయంలోకి వెళ్లాలంటే ఆధార్‌ నెంబరు చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సందర్శకులకు ఇక ఆధార్ నంబర్ తప్పనిసరి అని సాధారణ పరిపాలనా శాఖ ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అధికారిక, వ్యక్తిగత పనులపై సచివాలయానికి వచ్చేవారిని లోపలకు అనుమతించే ముందు వారి గుర్తింపునకు సంబంధించి పూర్తి వివరాలతో కొత్త పాస్ లు ఇవ్వాలని నిర్ణయించారు. అందువల్ల సందర్శకులు తమ వెంట ఆధార్ నెంబర్ ను తప్పనిసరిగా తీసుకువచ్చి, సంబంధిత అధికారికి తెలియజేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ నెంబర్ ఆధారంగా వారి వివరాలు కంప్యూటర్ లో నమోదు చేసి పాస్ ఇస్తారు.