ఉపవాసంతో వల్ల ఉపయోగాలేంటో తెలుసా..!!

SMTV Desk 2018-04-30 15:30:07  fasting uses, others, health tips.

హైదరాబాద్, ఏప్రిల్ 29 : ఉపవాసం ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తినే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు నిత్యం పనిచేసే జీర్ణవ్యవస్థలోని భాగాలకు విశ్రాంతి దొరుకుతుంది. దీని వల్ల శరీరంలోని వివిధ రకాల ద్రవాలు సమతుల్యం అవుతాయి. >> ఈ సంప్రదాయం అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలోని క్లెన్సింగ్ ప్రక్రియ జరిగి ఎంజైములు వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల విషపదార్ధాలన్ని బయటకు వెళ్లిపోయి ఒత్తిడి తగ్గుతుంది. వ్యర్ధాలు తొలగిపోవడం వల్ల చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. >> ఉపవాసం వల్ల ఆర్ధరైటిస్, రుమటైడ్ వంటి చర్మ సంబంధ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. >> బరువు తగ్గాలనుకొనేవారు ఉపవాసం చేయడం మంచిది. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పు వస్తుంది కాబట్టి కొవ్వు తగ్గుతుంది. >> ఉపవాసం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుందనేది నిజం కాదు. ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు తొలగిపోయి చురుకుదనం పెరుగుతుంది. >> శరీరంలోని మెటబాలిక్ రేటు పెరుగుతుంది. రక్తంతో ఫ్యాట్ లెవెల్స్ కరుగుతాయి. బీపీ, హైపర్ టెన్షన్ తగ్గుతాయి. >> ఉపవాసం రోజు చేయడం మంచిది కాదు. వారానికొసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జీర్ణవ్యవస్థకు ఒక్క రోజైన విశ్రాంతి దొరికినట్లు ఉంటుంది.