తెలుగుదేశం పార్టీది దగా కోరుల దీక్ష: రోజా

SMTV Desk 2018-04-30 13:26:33  rk roja chandra babu YSRCP Hunger Strike Special Category Status, Vizag

వైజాగ్‌, ఏప్రిల్ 30: ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌ సీపీనే అని, తెలుగుదేశం పార్టీది దగా కోరుల దీక్ష అంటూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసేంత వరకూ ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయిస్తే చంద్రబాబు, లోకేష్‌లు ఊచలు లెక్కబెడతారని ఆమె అన్నారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువయ్యిందని విశాఖపట్టణంలోని వంచన వ్యతిరేక దీక్షలో సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఐదుగురు ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ఏడీఆర్‌ రిపోర్టు చెబుతోందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 30(నేడు) టీడీపీల నేతల ఫూల్స్‌ డే అని అభివర్ణించారు. టీడీపీ-బీజేపీలు కలసి రాష్ట్ర ప్రజలను వంచించి మోసగించాయని రోజా ఆరోపించారు.