కృష్ణాజిల్లాకు ‘ఎన్టీఆర్’ పేరు : జగన్

SMTV Desk 2018-04-30 12:04:34   NTR, YS Jagan Mohan Reddy krishna YSRCP Praja Sankalpa Yatra

నిమ్మకూరు, ఏప్రిల్ 30: కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) జిల్లాగా మార్చుతామని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం కృష్ణా జిల్లా నిమ్మకూరులో వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్మకూరును అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. మరోవైపు కృష్ణాకు ఎన్టీఆర్‌ పేరును పెడతామనే వైఎస్‌ జగన్‌ ప్రకటనపై గ్రామస్థులు, ఎన్టీఆర్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.