వారికి అదనంగా 20 నిమిషాలు..!!

SMTV Desk 2018-04-30 11:15:03  others, tips, health tips.

హైదరాబాద్, ఏప్రిల్ 28 : నిద్ర మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయించే ఒక చర్య. చాలా మంది ఈ రోజుల్లో పనికి అలవాటు పడి నిద్రను నిర్లక్ష్యం చేస్తూ అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. అయితే.. పురుషుల, స్త్రీల విషయానికి వస్తే.. మగవారి కంటే ఆడవారికి 20 నిమిషాల నిద్ర అదనంగా అవసరమట. పిల్లలకు, వృద్దులకు 10 గంటలు, యువకులు, మధ్య వయసు వారికి 8 గంటల నిద్ర కనీసం అవసరం. కానీ.. స్త్రీ, పురుషుల నిద్ర సమయాల విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నం. పురుషులు కంటే స్త్రీలు రోజుకు 20 నిముషాలు అదనంగా నిద్రించాలట. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. పరిశోధనలు చేసి మరీ తేల్చిన విషయం. పురుషుల మెదడు కంటే స్త్రీల మెదడు ఎక్కువ విషయాల గురించి అలోచిస్తుదంట. పనులు వేగంగా, పక్కగా అమలు చేయడంలో ఆడవారి మెదడు కంటే పురుషుల మెదడు వెనుకబడే ఉంటుందంట. మల్టీటాస్కింగ్ లో పురుషుల కంటే మహిళలే టాప్ అనే విషయం గతంలో చాలా సర్వేలు, అధ్యయనాలు నిరూపించిన విషయం కూడా తెలిసిందే. మగవారి కంటే ఎక్కువ ఆలోచించే మహిళలు కాస్త ఎక్కువ సేపు నిద్రించాలని ఆరోగ్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.