అమెరికాలో భారీ కాల్పులు

SMTV Desk 2017-05-29 13:46:14  firing,firing in america,

మిస్సిసిపీ, మే 28 : అమెరికాలో ఓ సాయుధుడు పెట్రేగిపోయాడు. చుట్టుపక్కల వారిపై ఇష్టమొచ్చినట్లుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ డిప్యూటీ షెరీఫ్‌తోపాటు ఎనిమిది మంది మృతి చెందారు. మొత్తం మూడు ఇళ్లపై ఆ సాయుధుడు కాల్పులు జరిపాడు. కాల్పులకు తెగబడిన వ్యక్తిగా అనుమానిస్తూ తాము ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన శనివారం రాత్రి రూరల్‌ లింకన్‌ లో చోటు చేసుకున్నట్లు తెలిపారు. మిస్సిసిపీ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారిక ప్రతినిధి వారెన్‌ స్ట్రెయిన్‌ వివరాలు తెలియజేస్తూ చేతుల్లోకి తుపాకీ తీసుకున్న దుండగుడు మూడు ఇళ్లల్లోకి చొరబడి కాల్పులు జరిపాడని, దీంతో ఎనిమిది మంది చనిపోయారని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, అయితే, ముందే అతడి వివరాలు తెలియజేస్తే తొందరపాటు అవుతుందని భావిస్తున్నామని, ఇంకా అతడేనా కాదా అనే విషయం నిర్ధారించుకోవాల్సి ఉందని అన్నారు. అయితే, ఆ అనుమానితుడికి చనిపోయిన వారి కుటుంబాలకు ఏదైన సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.