కోలివుడ్ ఇండస్ట్రీకి జీఎస్టీ ఫీవర్!

SMTV Desk 2017-07-06 15:39:21  kollywood, industry, cinema, jst

చెన్నై, జూలై 06 : తమిళనాడు రాష్ట్రంలో థియేటర్ల యాజమాన్య సిబ్బంది సమ్మె చేపట్టడం వల్ల, కోలివుడ్ సినిమా పరిశ్రమ 60 కోట్లు నష్టపోయిందని తమిళనాడు థియేటర్ల యాజమాన్య సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్‌ తెలియజేసారు. ఇదే విషయంపై నగరంలోని ఒక థియేటర్ యజమాని స్పందిస్తూ, మూడు రోజులుగా కొనసాగుతున్న సమ్మె గురువారంతో ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇదే విషయంపై మరో సినిమా సంఘ నాయకులు స్పందిస్తూ, జీఎస్టీ లోని వినోదపు పన్ను సమ్మెకు ముఖ్యమైన కారణమనుకుంటునట్లు తెలియజేసారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ సైతం దీనిపై స్పందిస్తూ వినోదపు పన్ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విశ్వనటుడు కమల్‌హాసన్‌ కూడా తన స్పందనను ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. ఈ ట్వీట్‌ను రజనీకాంత్ ఆహ్వానించారు. ఇదే విషయంపై ఒక థియేటర్ యజమాని మాట్లాడుతూ టిక్కెట్ల ధరలు పెంచే పరిస్థితి రావోచ్చని అని పేర్కొన్నారు. ఈ వారంలో విడుదలవ్వాల్సిన 4 పెద్ద సినిమాలను నిలిపివేస్తూన్నట్లు డైరెక్టర్లు తెలిపారు. ఇదే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా రెండు డిమాండ్లను పెట్టామని చెప్పారు. అందులో ఒకటి... టిక్కెట్ల ధరలు పెంచడం, రెండు... స్థానిక పన్నును తగ్గించడమని తెలిపారు. 10 సంవత్సరాల నుండి టిక్కెట్ల ధర పెంచలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని తెలియజేసారు. గవర్నమెంట్ తో చేపట్టిన చర్చలలో సానుకూల ఫలితం వొస్తే సినిమాల విడుదల గురించి ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాదిలో పెద్ద సినిమాలు బాక్సఫీస్ వద్ద అపజయాలు మూటకట్టుకోవడం, వస్తు సేవల పన్ను అమల్లోకి రావడం వల్ల కోలివుడ్ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆయన వెల్లడించారు.