ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలు అరెస్టు

SMTV Desk 2018-04-26 18:17:43  Online cricket betting gang, arrest, task force police, vizag

విశాఖపట్నం, ఏప్రిల్ 26: నగరంలో ఇళ్లను అద్దెకు తీసుకొని ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న రెండు ముఠాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా, విజయవాడకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 10.60 లక్షలు, 105 సెల్‌ఫోన్లు, కారు, బైక్‌లు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వారికి ఎక్కడెక్కడి ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.