ఇంటికో ఉద్యోగం అని చెప్పలేదు: ఈటల

SMTV Desk 2018-04-26 17:50:06  Finanace Minister, Etala Rajender,Jobs, telangana

పెద్దపల్లి, ఏప్రిల్ 26: ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పలేదని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 35వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ చిత్రపటంలో నెంబర్ వన్‌గా నిలబెట్టామని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు మెచ్చిన పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఈటల పేర్కొన్నారు.