విమానం వద్ద ప్రత్యక్షమైన కొండచిలువ..!!

SMTV Desk 2017-07-06 14:24:56  snek, in, agra, airport

ఆగ్రా, జూలై 6 : ఆగ్రాలోని ఎయిర్‌బేస్‌లో ఓ పెద్ద కొండచిలువ కలకలం సృష్టించింది. విమానం నంబరు కె 2706 ఎఎన్-32 పార్క్ చేసి ఉన్న షెడ్డులోని ఇరుకైన ప్రదేశంలో 8 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండచిలువను రక్షించేందుకు ఎయిర్ ఫోర్స్ అధికారులు వన్యప్రాణి అధికారులకు సమాచారం అందించారు. ఈ కొండచిలువ అనారోగ్యంతో ఉందని గుర్తించిన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పాములను పట్టే నిపుణులను పిలిపించి దాదాపుగా ఐదుగంటల పాటు కష్టపడి జాగ్రత్తగా కొండచిలువను వెలికి తీసారు. దాన్ని వాహనంలో తరలించి పశువైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వైద్యం చేయించాక దాన్ని సురక్షితంగా అడవుల్లో వదిలేస్తామని వన్యప్రాణి అధికారులు తెలిపారు. కాగా కొండచిలువను చంపకుండా, కాపాడేందుకు సహకరించిన ఎయిర్ ఫోర్స్ అధికారులను వన్యప్రాణుల సంరక్షణ విభాగం అధిపతి బైజురాజ్ అభినందించారు.