ఉగ్రవాదుల కాల్పుల్లో పీడీపీ నేత హతం

SMTV Desk 2018-04-25 18:14:46  terrorists, attacked, pdp leader, jammu kashmir

శ్రీనగర్, ఏప్రిల్ 25: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో పీడీపీ నేత గులాం నబీ పటేల్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరణించారు. పుల్వామా నుంచి యాదెర్‌కు వస్తుండగా పటేల్ కారుపై రాజ్‌పోరా వద్ద ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఆయన భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొరికిన తూటాలను స్వాధీనం చేసుకొని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు