కళ్యాణ్ రామ్ సినిమాకు తారక్ క్లాప్..

SMTV Desk 2018-04-25 12:58:37  kalyanram new movie, ntr, kv guhan, tollywood

హైదరాబాద్, ఏప్రిల్ 25 : నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా, కేవీ గుహన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈరోజు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఆరంభ షాట్ కు ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్‌, షాలిని పాండే నటించనున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి నివేదా ట్వీట్ చేస్తూ..’ఈ ప్రాజెక్ట్‌ను హరికృష్ణ సర్‌ ఆశీర్వాదాలతో మొదలుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమానికి వచ్చినందుకు థాంక్యూ తారక్’ అని పేర్కొన్నారు. మరోపక్క కల్యాణ్‌ రామ్‌ ‘నా నువ్వే’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన తమన్నాకి జంటగా నటిస్తుండగా.. జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.‌ ఇటీవల కళ్యాణ్ రామ్ ‘ఎంఎల్‌ఏ’తో మంచి విజయం అందుకున్నారు. ఎమ్మెల్యేగా, మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిగా ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.