చంద్రబాబుకు ముద్రగడ చురకలు

SMTV Desk 2018-04-25 12:39:41  mudragada padmanabham chandra babu letter Andhra Pradesh

కాకినాడ, ఏప్రిల్ 25: ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చురకలంటించారు. ఆర్టీసీ బస్సులపై తెలుగుదేశం పార్టీ నాయకుల పోస్టర్లు చిరిగినందుకు దౌర్జన్యం చేస్తారా? అంటూ నిలదీశారు. ఈ మేరకు చంద్రబాబుకు బహిరంగ లేఖను రాశారు. ఇలాంటి దాడులను ఆపకపోతే ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని కాపు జాతికి పిలుపునిస్తానని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ వద్ద డబ్బు బలం ఉంటే తమ వద్ద జన బలం ఉందన్నారు. కులాల మధ్య గొడవల అలజడులను రేపుతూ అధికారం కోసం టీడీపీ ఎన్నో తమషాలు చేస్తోందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజలకు న్యాయం జరగకుండా అన్యాయం చేస్తున్నారు. ప్రత్యేక హోదా వంకతో మీ జన్మదినాన ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసిన కోట్లాది రూపాయల వల్ల ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు