25న కాంగ్రెస్‌లో చేరనున్న నాగం

SMTV Desk 2018-04-24 17:50:49  Ex. minister Nagam Janardhan Reddy, shortly, congress party

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 23: బీజేపీ సభ్యత్వానికి, జాతీయ కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కుదిరింది. బుధవారం రోజు ఏఐసీసీ అధ్య క్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు కొల్లాపూర్‌కు చెందిన ముష్టిపల్లి జగదీశ్వర్‌రావు, కరీంనగర్‌కు చెందిన వ్యాపా రవేత్త కొత్త జయపాల్‌రెడ్డి, పటాన్‌ చెరువు కు చెందిన అంజిరెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీ కండువాలను కప్పుకోనున్నారు. మూడు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగుతు న్న నాగం జనార్దన్‌రెడ్డి ఆరు పర్యాయాలు నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా కొనసాగిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం సందర్భంగా తెలుగుదే శం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ నగారా సమితిని స్థాపించారు. ఆ తర్వాత జరిగి న పరిణామాల నేపథ్యంలో నగారా సమితిని బీజేపీలో విలీనం చేశారు. ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గానికి, ప్రాథమిక సభ్యత్వా నికి రాజీనామా సమర్పించారు. చాలా కాలంగా నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యం లో వారం రోజుల క్రితం ఆయన స్పష్టత ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని ఎం డగట్టేందుకు కాంగ్రెస్‌లో చేరు తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.