మలయాళ రీమేక్ లో అల్లు శిరీష్..!

SMTV Desk 2018-04-24 15:16:17  ALLU SHIRISH, MALAYALAM REMAKE MOVIE, ABCD MOVIE, DULKAR SALMAN.

హైదరాబాద్, ఏప్రిల్ 24 : అల్లు శిరీష్ మంచి హిట్ కోసం ఇంకా తన అన్వేషణలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల విడుదలైన "ఒక్కక్షణం" మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో మంచి కథ కోసం శిరీష్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. తాజాగా శిరీష్ ఓ మలయాళ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ కి మంచి స్టార్ డమ్ తెచ్చిన సినిమా "ABCD(అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేసి)". ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిరిగింది. నటనకు ప్రాధాన్య౦ ఉన్న కథ కావడంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి అప్పట్లో చాలా మంది ఆసక్తి చూపించారు. కాని ఆ అదృష్టం ఇప్పుడు అల్లు శిరీష్ కు దక్కింది. భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రంలో పలు కామెడీ సీన్స్ కూడా అదరగొట్టాయి. మరి దుల్కర్ సల్మాన్ నటించిన పాత్రలో అల్లు శిరీష్ ఏ విధంగా ఆకట్టుకుంటాడో.? ఈసారైన శిరీష్ కు అదృష్టం కలిసొస్తుందో. లేదో.! చూడాలి మరి.