చంద్రకాంతి పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు

SMTV Desk 2018-04-24 14:28:50  ap cm chandrababu naidu, sarted chandrakanthi schme, east godavari

తూర్పుగోదావరి, ఏప్రిల్ 24: పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ద్వారపూడిలో చంద్రకాంతి పథకాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్రానికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో వందశాతం ఎల్ఈడీ బల్బులు అమర్చామన్నారు. దేశంలోనే తొలి పూర్తిస్థాయి ఎల్‌ఈడీ వీధి దీపాలు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాను ప్రకటించారు. అక్టోబర్‌ నాటికి అన్ని పల్లెల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంట్లో ఎల్‌ఈడీ బల్బులనే వినియోగించాలని కోరారు.