బన్ని కోసం చరణ్..!!

SMTV Desk 2018-04-24 11:57:36  na peru surya, allu arjun, ram charan, pri release event.

హైదరాబాద్, ఏప్రిల్ 24 : అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్న చిత్రం నా పేరు సూర్య". ఈ చిత్రాన్ని రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలోని మాధవరం లో ఆడియో వేడుకను జరుపుకున్న ఈ చిత్రబృందం.. ఈ నెల 29న ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. గచ్చిబౌలిలో ఈ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరో తెలుసా.? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గతంలో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో బన్ని, చరణ్ ఒకే వేదికను పంచుకున్నారు. తాజాగా మరోసారి చెర్రి బన్ని కోసం ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా లగడపాటి శ్రీధర్‌, నాగబాబు సమర్పకుడుగా వ్యవహరించారు. ఈ సినిమాలో బన్ని సరసన అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించగా.. విశాల్‌, శేఖర్‌ సంగీతం అందించారు.