హిందు గురువులతో షబ్బీర్ అలీ పూజలు

SMTV Desk 2018-04-24 11:31:32  Hyderabad, Deputy Clp leader, shabbir ali, hindu temple,

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ హిందూ దేవాలయంలో పూజలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలోని ఓ దేవాలయంలో హిందూ మత గురువులతో కలసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయనను గురువులు ఆశీర్వదించారు. ఆయనకు శాలువా కప్పి, స్వామి వారి మెమెంటోను అందజేశారు. మరోవైపు, షబ్బీర్ అలీ దేవాలయానికి రావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది సర్వమత సౌభ్రాతృత్వానికి చిహ్నమని అంటున్నారు.