ఎన్టీఆర్ బయోపిక్ పై స్పందించిన నారా లోకేష్..

SMTV Desk 2017-07-05 18:08:22  ntr, naralokesh, ramgopal varma, directers

అమరావతి, జూలై 5 : దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ప్రకటించారు. ఆయన జీవితంలో జరిగిన కుట్రలు, ఆ కుట్రల వెనకున్న అసలైన కుట్ర ఏంటనే విషయాన్ని తెరపై చూపిస్తానని తెలిపారు. ఆయన జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని అంశాలు, ఆయన నాశనాన్ని కోరుకున్నవారు ఇలా ప్రతి ఒక్కటి ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాపై ఆయన మనవడు, మంత్రి నారా లోకేష్ స్పందించి పోర్చుగల్ కు వెళ్లినప్పుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఒక సినిమా తీయాలని అనుకున్నామని, ఆ సినిమాకు బాలయ్య బాబు అయితేనే సరిగ్గా సరిపోతారని, ఏ దర్శకుడైనా బాలయ్య ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.