మహేష్ నటన అద్భుతం : ఎన్టీఆర్

SMTV Desk 2018-04-23 13:05:53  bharath ane nenu, ntr comment son mahesh babu movie, mahesh babu, koratala shiva.

హైదరాబాద్, ఏప్రిల్ 23 : భరత్ అనే నేను చిత్రానికి టాలీవుడ్ ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. యువ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటించిన తీరు అందరి ఆకట్టుకుంటోంది. ఆయన నటనకు అభిమానులు మంత్రముగ్దులవుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన య౦గ్ టైగర్ ఎన్టీఆర్.. మహేష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని తీయడం అంత తేలికైన విషయం కాదు. కానీ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని చాల బ్యాలెన్సింగ్ గ తీర్చిదిద్దారు. ఇంత అద్భుతంగా నటించిన మహేష్ కు నా శుభాకాంక్షలు. ఈ చిత్రం మహేష్ కెరీర్ లో ఒక మెయిలు రాయిగా నిలిచిపోతోంది. భరత్ అనే నేను చిత్రబృందం మొత్తానికి నా శుభాకాంక్షలు" అంటూ పేర్కొన్నారు. కైరా అద్వానీ నటి౦చిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా డీవీవీ దానయ్య నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.