"భరత్" పార్టీ టైం..

SMTV Desk 2018-04-23 12:32:45  bharath ane nenu, team enjoyment, bharath treat, mahesh babu, koratala shiva.

హైదరాబాద్, ఏప్రిల్ 23 : మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన "భరత్ అనే నేను" చిత్రం రికార్డుల దిశగా దూసుకుపోతోంది. సినిమా విడుదల నాటి నుండే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కొరటాల శివ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య నిర్మించారు. కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది. అంతేకాదు ఓవర్సీస్ లోను భారీ వసూల్లనే రాబడుతోంది. అయితే ఈ సంతోష స‌మ‌యాన్ని "భ‌ర‌త్ అనే నేను" ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం పనిచేసిన టీం మొత్తం ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఈవెంట్ కు సినిమా కోసం పనిచేసిన టీంతో పాటు ప్రిన్స్ మహేష్ బాబు కూడా హాజరయ్యారు. మహేష్ ఈ సినిమా విడుదలకు ముందే చిత్ర‌బృందంలోని కీల‌క స‌భ్యుల‌కు ఐఫోన్లు అందించిన విషయం తెలిసిందే.