బ్యూటీ ఫార్ములా..

SMTV Desk 2018-04-22 18:23:16  beauty tips, skin protection, hyderabad, fruits salads

హైదరాబాద్, ఏప్రిల్ 21 : శరీరం నిగారింపుతో కాంతివంతంగా కనిపించాలంటే కొన్ని నియమాలు పాటిస్తే చాలు... వాటిలో కొన్ని మీకోసం.. >> మంచినీళ్ళు వీలైనంత ఎక్కువగా తాగాలి. టీ, కాఫీల బదులు నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తాగుతుండాలి. పండ్లు, సలాడ్లు, మొలకెత్తిన ధాన్యాలు, ఉడకబెట్టిన ఆహారపదార్ధాలను తినడం ద్వారా వీలయనన్ని విటమిన్లు, ఎంజైములని ప్రోది చేసుకోవాలి. >> శరీరం నిగారింపుకు ఉసిరి, క్యారెట్లు బాగా దోహదం చేస్తాయి. గుడ్లు, ఇతర మాంసాహారలకు దూరంగా ఉండాలి. >> పూర్తి శాఖాహారాన్ని ప్రకృతి వైద్యం సూచిస్తుంది. తాత్కాలికంగానైనా మాంసాహారాన్ని మానేయాలని చెప్తారు. మట్టితో మెరుపులు .. >> నేచురోపతి కేంద్రాలలో శారీరక వ్యవస్థను పరిశుభ్రపరిచే విధానాలు ఉంటాయి. ఒత్తిడి కలిగించే మసాజ్ ల నుండి వేడి, చల్లని కంప్రేషన్ల దాకా చర్మాన్ని చైతన్యవంతంగా చేస్తుంది. >> భూమిపై నుండి మూడుడగుల లోపలి శుభ్రమైన మట్టితో ప్యాక్స్ వేయడం ద్వారా చర్మం మీద ఏర్పడిన పోర్స్ తోలిగిస్తారు. శారీరక మాలిన్యాలు తొలిగిపోవడానికి యోగాభ్యాసం అవసరం. చర్మకాంతి పెరగడానికి అనుకూల దృక్పథం అవసరమని ప్రకృతి వైద్యం చెప్తుంది. >> జీవన విధానాన్ని సమతౌల్యపరచడం, మానసిక విశ్రాంతి, శరీరంలో చురుకుదనం కలిగించడం, తాజా అనుభూతులు, ఉత్సాహం కలిగించేదుకు ప్రకృతి చికిత్సా విధానాలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. >> సహజమైన ఔషదాలు, గుడ్లు, పాలు, పెరుగు వంటి వాటితో చేసిన తాజా గుజ్జులను ఉపయోగించడం ద్వారా ఫేసియల్ ట్రీట్ మెంట్స్ ఇస్తారు. వీటిని పరిశుభ్రమైన నీటితో కలిపి చర్మానికి చికిత్స చేస్తారు. >> సమతౌల్య వాతావరణ పరిస్థితులు, ఒత్తిడి, టెన్షన్, వల్ల శరీరంలో సహజ తైలాలను విటమిన్లు కోల్పోవలిసి వస్తుంది. కాబట్టి శరీరాన్ని ప్రకృతి పరంగా కాపాడుకోవాలి. కాని పై పూతలు, కెమికల్స్ వంటివి ఉపయోగించడం వల్ల కాదని ప్రకృతి వైద్యులు చెప్తారు.