డబ్బులు ఇవ్వని బ్యాంకులపై కేసులు పెట్టండి!: కేసీఆర్

SMTV Desk 2018-04-22 16:35:04  CM KCR warns banks not to dishonour cheques

హైదరాబాద్ , ఏప్రిల్ 22: కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా స్పందించారు. జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పాలనాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాళ్లు తీసుకుంటున్న నిర్ణయాలతో... ఇక్కడ మనం ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. బ్యాంకులకు డబ్బులు పంపరు, ఏటీఎంలలో డబ్బులు పెట్టరంటూ కేంద్రంపై ధ్వజమెత్తారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి 6వేల కోట్లు తెప్పించామని... వాటిని రైతుల కోసం బ్యాంకులు రిజర్వ్ చేసి పెడతాయని కేసీఆర్ చెప్పగా... రైతులు చెక్కులు ఇచ్చినా, బ్యాంకులు డబ్బులు ఇస్తాయనే గ్యారంటీ లేదని కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డబ్బులివ్వని బ్యాంకులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టే బ్యాంకులను వదిలిపెట్టవద్దని అన్నారు.