నయనాల రక్షణకు కొన్ని చిట్కాలు..

SMTV Desk 2018-04-22 16:26:35  EYES TIPS, EYES CARE, HYDERABAD, EYES

హైదరాబాద్, ఏప్రిల్ 22 : మానవ శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైనవి. వాటిని చక్కగా పరిరక్షించుకోవాలి. అందుకోసం కొన్ని చిట్కాలు.. >> కళ్ళు కాంతివంతంగా ఉండాలంటే కంటికి మంచి వ్యాయామంతో పాటు, సరైన పోషకాహారం చాలా అవసరం. ఎండిన ఉసిరికను ఒక రాత్రంతా నీళ్ళల్లో నాన్చి ఉదయం పూట ఆ నీటిని వడకట్టి కళ్ళను కడిగితే, చూపు పెరిగి, కంటి వ్యాధులు నయమవుతాయి. >> శుభ్రమైన చెంబుడు నీళ్ళలో ఒక రాత్రంతా ఒక కొత్తిమీర కట్ట నానబెట్టి తెల్లారి ఆ నీళ్ళు వడకట్టి, ఆ నీటితో కళ్ళును కడగడం కంటి అర్యోగానికి మంచిది. >> ప్రతిరోజు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం ముందు, సూర్యాస్తమయం తర్వాత మెత్తని పచ్చిక మీద నడవడం కంటి చూపుకు చాలా సహాయకారిగా ఉంటుంది. ఎండలో తిరిగి అలిసి వచ్చాక మొదటి కాళ్ళు కడగాలి. తద్వారా చల్లదనం కంటికి పాకుతుంది. >> ఒక కన్ను మూసి మరో కన్నుతో కొద్దిక్షణాల పాటు సూర్యోదయ వేళా కిరణాలన్ని చూడడం అభ్యాసం చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఒక కన్నుతో మూడు నాలుగు సార్లు చేయడం మంచి వ్యాయామం. >> విశాలంగా పరుచుకున్న పచ్చిక బయళ్ళను, పచ్చని చెట్లను రెప్పలార్పకుండా ఎంతసేపు చూడగలిగితే కంటికి అంతా అర్యోగం.