ఆ కంపెనీలకి మధ్య డీల్ కుదరలేదట!!

SMTV Desk 2017-07-05 13:48:48  flip cart, snapdil, stafbank, kunal behal, rohith board

న్యూఢిల్లీ, జూలై 5 : ఈ-కామర్స్ కంపెనీలు ఫ్లిప్ కార్ట్- స్నాప్ డీల్ ల మధ్య జరగాల్సిన ఒప్పందం విఫలమైంది. స్నాప్ డీల్ లను కొనుగోలు చేసేందుకు ప్రత్యర్థి కంపెనీ ఫ్లిప్ కార్ట్ ఇచ్చిన 80-85 కోట్ల డాలర్ల ఆఫర్ ను స్నాప్ డీల్ బోర్డ్ తిరస్కరించింది. ఇటీవల స్నాప్ డీల్ ను టేక్ ఓవర్ చేసేందుకు ఫ్లిప్ కార్ట్ పరిశీలించే ప్రక్రియను ఇటీవల పూర్తి చేసి ఆఫర్ చేసిన మొత్తానికి స్నాప్ డీల్ అంగికరించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలోని స్నాప్ డీల్ కంపెనీ వాస్తవ విలువ కంటే ఈ ఆఫర్ తక్కువని కంపెనీ బోర్డు భావిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించారు. ఈ తొలి ఆఫర్ తిరస్కరణకు గురైనప్పటీకి ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై స్నాప్ డీల్ లో ప్రధాన వాటాదారు అయిన స్టాఫ్ బ్యాంక్ ఈ డీల్ కోసం గత కొద్ది నెలలుగా ప్రయత్నాలు జరుపుతోంది. స్నాప్ డీల్ వ్యవస్థాపకులు కూనల్ బెహెల్, రోహిత్ బన్సాల్ కూడా బోర్డు లో ఉన్నారు. ఈ డీల్ జరిగితే ఇండియా ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద టెక్ ఓవర్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల పోటీతో కొద్ది నెలలుగా స్నాప్ డీల్ వ్యాపారం తగ్గుతూ వస్తోంది. 2016 ఫిబ్రవరి స్నాప్ డీల్ ను 650 కోట్ల డాలర్లకు విలువ కడుతూ పెట్టుబడులు రాగా, తాజాగా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ప్రకారం 100 కోట్ల డాలర్లలోపునకు విలువ తగ్గడం గమనార్హం. ఈ మేరకు స్నాప్ డీల్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ తో జరగాల్సిన డీల్ ను రద్దు చేసుకుంది.