పవన్‌ది పూటకో మాట: మంత్రి సోమిరెడ్డి

SMTV Desk 2018-04-21 17:57:00  Agriculture minister, somireddy chandramohan reddy, counter pawan kalyan

నెల్లూరు, ఏప్రిల్ 21: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన ఆరోపణలను పట్టించుకోమని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ పూటకో మాట మాట్లాడతారని విమర్శించారు. ఫిలిం చాంబర్‌లో జరిగే వ్యక్తిగత విషయాలను తమపై రుద్దొద్దని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేసే వ్యక్తి కాదని సోమిరెడ్డి పేర్కొన్నారు.