రెండు రోజులు..మండుటెండలు!

SMTV Desk 2018-04-21 16:24:06  Hyderabad Weather CenterTemperatures telangana Summer Care

హైదరాబాద్, ఏప్రిల్ 21: రాష్ట్ర౦ లో రెండు రోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. శని, ఆదివారాల్లో ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ ​కేంద్ర అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఎండలు మండుతున్నయి. శుక్రవారం అనేక చోట్ల 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తాజా హెచ్చరికతో ప్రజలు బంబెలెత్తిపోతున్నారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. మరో వైపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో శుక్రవారం అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక వెల్లడించింది.