రాష్ట్రపతి అభ్యర్థి ని కెసిఆర్ అవమానించారా???

SMTV Desk 2017-07-05 13:31:47  ponnam prabhakar, congress, ex, mp

హైదరాబాద్: తెలంగాణ ఇవ్వడంలో స్పీకర్ మీరాకుమార్ పాత్ర, బిల్లు ఆమోదించడంలో ఆమె కృషి మరువలేనిదని, అలాంటిది.. మద్దతు కోసం కేసీఆర్ కు ఫోన్ చేస్తే స్పందించకుండా మీరాను అవమానించడం సరికాదన్నారు. అసలు సీబీఐ కేసులకు భయపడే బీజేపీ అభ్యర్థి అయిన రామ్ నాథ్ కోవింద్ కు కేసీఆర్ ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి సత్యనారాయణ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీభవన్ లో జరిగిన ఈ సమావేశం లో మాజీ ఎంపీలు అంజన్ కుమార్, సురేష్ శేత్కర్ తదితరులు పాల్గొన్నారు.