క్రికెట్ లో కొత్త ఫార్మాట్‌ రానుందా...!

SMTV Desk 2018-04-20 18:44:40  new cricket format, ecb, mcb, england

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 : ప్రపంచ క్రికెట్ చరిత్రలో మనకు తెలిసినవి మూడు ఫార్మాట్లు.. టెస్ట్.. వన్డే.. టీ-20 . ఇప్పుడు ఇంకో సరికొత్త ఫార్మాట్ క్రికెట్ అభిమానులను అలరించనుందని సమాచారం. ఆ దిశగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దూసుకెళ్తోంది. 2020లో నిర్వహించ తలపెట్టిన 8 జట్ల దేశవాళీ టోర్నీలో వంద బంతుల టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది. 2020లో ఆరంభించాలనుకుంటున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో ఎనిమిది జట్ల చొప్పున పోటీ పడతాయి. ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు మామూలుగా ఓవర్‌కు ఆరు బంతులుగా ఉంటాయి. చివరి ఓవర్లో మాత్రం పది బంతులేయాలి. అయితే చివరి ఓవర్లో 10 బంతులు అనే పద్ధతికి ఎంసీసీ నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ఈసీబీ ప్రకటించిన వంద బంతుల ఫార్మాట్‌పై తాజా మాజీ ఆటగాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు.