మెట్రో ప్రాజెక్ట్ గడువు పొడిగింపు...

SMTV Desk 2017-07-05 12:34:45  metro,rail, project, edr reddy , hyderabad, lb nagar, miyapur,nagole,haitechcity

హైదరాబాద్, జూలై 5 : హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే తరుణంలో మళ్లీ గడువు తేదీని పొడగిస్తున్నట్లు వెల్లడైంది....రాజధాని నగరంలో గత కొంత కాలంగా మెట్రో ప్రాజెక్టు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే, జూలై 4, 2017 నాటికి ఈ మెట్రో పనులు పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. దీంతో గ్రేటర్ వాసుల కలలు మెట్రో పై పెట్టుకున్నారు. కానీ మరో సారి గడువు పొడిగించడం జరిగింది. ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం జూలై 4 లోపే పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ పనులు 2018 నవంబర్ వరకు పూర్తిచేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థలతో జరిగిన చర్చల్లో పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివరిలోపు మాత్రం నాగోల్-హైటెక్ సిటీ (27 కి.మీ), ఎల్బీనగర్ - మియాపూర్ (29కి.మీ) మార్గాన్ని పూర్తి చేస్తామన్నారు. మెట్రో ప్రాజెక్ట్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ.. నిర్మాణ గడువు పెంచని పక్షంలో బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలకు సంబంధించిన వాయిదాలను ఆగష్టు నెల నుంచే చెల్లించాల్సి ఉంటుందని ఎల్అండ్ టీ సంస్థ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాయడం జరిగింది. ఈ గడువు పొడిగించడంతో మరో 4 వేల నిర్మాణ వ్యయం పెరిగినట్లు ఎన్వీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా మెట్రో ప్రాజెక్ట్ పనుల కోసం అవసరమైన ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్సీ సింగ్ హెచ్ఎంఆర్, జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను అధికారులు ఆదేశించారు. ఇంకో సంవత్సరం పాటు నగర వాసులకు మెట్రో కారణంచే ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది.