నొప్పితో బాధపడుతున్నారా.! మీ కోసం కొన్ని ఔషధాలు..

SMTV Desk 2018-04-20 17:32:17  periods pain releaf, instructions.

ముంబై 20 ఏప్రిల్ : నెల సరి సమయంలో నొప్పి ఆడవారి పాలిట నిజంగా శాపం అనే అనుకోవాలి. నెలలో ఆ మూడురోజులూ చాలా మంది నొప్పితో కృంగిపోతుంటారు. ఆ నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే ఓ సారి ఇలా ప్రయత్నించి చూడండి. * పసుపుకొమ్ముల్ని సున్నంలో ఉడికించి, చల్లారాక పసుపుకొమ్ముల్ని మెత్తగా తరిగి, ఎండబెట్టి దంచితే చక్కని పొడి వస్తుంది. ఒక చెంచా మోతాదులో ఈ పొడిని 3 పుటలా రోజూ మజ్జిగతో కలిపిగానీ, తేనెతోగానీ తీసుకోండి. నెలసరి నొప్పి తగ్గుతుంది. * నెల ఉసిరిక మొక్క విశాలంగా ఉన్న ప్రతీపెరట్లోనూ పెరుగుతుంది. ఈ మొక్క చిన్న ఉసిరిమొక్క ఆకారంలోనే ఉంటుంది. ఇది అరాడుగుకన్నా పెద్ద ఎత్తు ఎదగదు. ఆకులు నేలబారుగా పెరుగుతాయి. ఆకురెమ్మల వెనుకభాగాన, రెమ్మబారున నల్లపూసలంత కాయలు సరిగ్గా ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి. దీని ఆకులూ కూడా ఉసిరి ఆకారంలోనే ఉంటాయి. దీన్నినేల ఉసిరిమొక్క అంటారు. ఈ మొక్క వేళ్ళని బియ్యపు కడుగునీటితో మెత్తగా నూరిగానీ, బియ్యపుకడుగు నీళ్ళలో కాషాయంకాచి గానీ తాగిస్తే ఋతుస్రావం అధికంగా అవడం తగ్గుతుంది. ఆ మూడు రోజులు అసౌకర్యం ఉండదు. నొప్పి అంతగా రాకుండా ఆగిపోతుంది. * వామును నేతిలో వేయించి, మెత్తగా దంచి, ఆ పొడిలో ఉప్పు తగినంత కలిపి అన్నంలో 1-2 చెంచాల చొప్పున రోజూ తినండి. నెలసరి బాధలు తప్పుతాయి. * పుదీనా ఆకులను దంచి కషాయం కాచుకొని తాగండి. నొప్పి టక్కున తగ్గిపోతుంది. * మందార పూలమొక్క ప్రతి ఇంట్లోనూ పెరుగుతూనే ఉంటుంది. చాలా తేలికగా దొరికే మొక్క. దాని వేరుని మెత్తగా దంచి పాలలో వేసుకుని తాగితే వాతం వలన వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది.