హ్యాట్సాఫ్‌ క్రిస్‌ గేల్‌ : విలియమ్సన్‌

SMTV Desk 2018-04-20 16:20:26  chris gayle, kane williamson, ipl, srh, kings x1 punjab

మొహాలీ, ఏప్రిల్ 20 : జనవరిలో జరిగిన ఐపీఎల్-11 సీజన్ వేలంలో క్రిస్ గేల్‌ ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచిజై కొనుగోలు చేయలేదు. దీంతో అభిమానులు ఒకింతా బాధపడ్డారు. కానీ అనూహ్యంగా కింగ్స్ X1 పంజాబ్ జట్టు యూనివర్సల్ బాస్ ను కనీస ధర రూ. 2 కోట్లకు దక్కించుకొంది. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ గేల్‌ ఆడిన రెండు మ్యాచ్ ల్లో అర్ధ శతకం, శతకంతో ఆకట్టుకున్నాడు. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్ లో గేల్‌ ఇన్నింగ్స్ వెన్నుముకలా నిలిచింది. 63 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన అతను బలమైన హైదరాబాద్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఆ ఆట చుసిన ఎవరైనా ఫిదా అవ్వకుండా ఉండలేరు. సన్‌రైజర్స్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ గేల్‌ ఆటకు హ్యాట్సాఫ్‌‌ చెప్పాడు . మ్యాచ్‌ అనంతరం కేన్‌ మాట్లాడుతూ.."క్రిస్‌ గేల్‌కు హ్యాట్సాఫ్‌‌. చాలా బాగా ఆడాడు. అతను ఏం చేశాడో అందరికీ తెలుసు. అద్భుతమైన శతకం సాధించాడు. ఈ విజయానికి పంజాబ్‌ జట్టు పూర్తిగా అర్హమైనది. ఈ రోజు మేము మా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాం. ఈ మ్యాచ్‌ నుంచి మేము చాలా నేర్చుకున్నాం" అని విలియమ్సన్‌ వ్యాఖ్యానించాడు.