ఈసీని కలిసిన కాంగ్రెస్‌ నేతలు

SMTV Desk 2018-04-20 13:33:38  .Congress MLAs Komatireddy, Sampath Meets EC In Delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్ సభ్యత్వం రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. అప్రజాస్వామిక రీతిలో తెలంగాణ ప్రభుత్వం తమ సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేయడాన్నికాంగ్రెస్ సినీయర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో ఈసీకి వివరించారు. రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు