కర్ణాటక ఎన్నికలు : ఈసీ కీలక నిర్ణయం

SMTV Desk 2018-04-20 12:02:18  karnataka elections, karnataka ec, ceo sanjeev kumar, karnataka

యశవంతపుర, ఏప్రిల్ 20 : కర్ణాటక రాష్ట్రంలో వచ్చే నెలలో మే 12 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉండగా, దానిని కాస్త ముందుకు జరిపారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ఒక గంట సమయంను అదనంగా కేటాయించిన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సంజీవ్‌కుమార్‌ వెల్లడించారు. గురువారం ఆయన బెంగళూరు విధానసౌధలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించటానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నందున ఓటర్లకు అనుకూలం కోసం సమయం పెంచామన్నారు.