వైఎస్ఆర్ భార్యగా రమ్యకృష్ణ..!

SMTV Desk 2018-04-19 18:19:25  YATRA MOVIE, YSR BIOPIC, ramya krishna, nayanatara.

హైదరాబాద్, ఏప్రిల్ 19 : ఉమ్మడి రాష్ట్రాల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా "యాత్ర" పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. మహి రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైఎస్ఆర్ గా మళయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా నయనతార వైఎస్ఆర్ భార్య విజయమ్మగా నటిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. తాజాగా నయనతారకు బదులు విజయమ్మ పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్రకు రమ్యకృష్ణ అయితేనే బాగుంటుందని తనను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలన్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టాలంటే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.!