చర్మరక్షణకు కొన్ని చిట్కాలు..

SMTV Desk 2018-04-19 17:15:21  summer health care, protection for skin, skin proection tips, hyderabad

హైదరాబాద్, ఏప్రిల్ 19 : వేసవికాలంలో చర్మాన్ని పరిరక్షించుకోవాలి. మండే ఎండల నుండి మృదువైన మన చర్మాన్ని కాపాడేందుకు కొన్ని చిట్కాలు మీకోసం.. >> మండే ఎండల మధ్య చర్మాన్ని రక్షించుకోవాలంటే ముందు చర్మ తత్వాన్ని తెలుసుకోవాలి. చర్మం ఎండిపొయినట్లు కాకుండా ఉండాలంటే మంచి నీళ్ళు బాగా తాగాలి. ఎండలో ఎక్కువ సేపు తిరగకూడదు. తప్పదు అనుకుంటే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. >> కనురెప్పలపైన, కళ్ళ చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కళ్ళజోళ్ళు వాడడం ద్వారా ఈ సున్నితమైన చర్మాన్ని రక్షించుకోవాలి. సూర్యరశ్మి నుండి కాపాడే కాస్మోటిక్స్ ను ఉపయోగించాలి. పెదాలకు లిప్ బామ్ వాడాలి. >> బయటకు వెళ్ళేటప్పుడు సన్ ప్రొటెక్షన్ క్రీమ్ ను రాసుకోవాలి. కాలిపై చర్మం పగుళ్ళు బారకుండా రోజుకు రెండు సార్లు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని, ఆరిన తర్వాత యాంటి ఫంగల్ క్రీమ్ రాసుకోవాలి. >> ఆయిలీ స్కిన్ గలవారు ఎండాకాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవాలి. కొంత మందికే ఊరికూరికే ముఖం జిడ్డుగా మారిపోతుంది. >> ముల్తానా మట్టితో ఫేస్ ప్యాక్స్ రెండుమూడు రోజులకు ఒకసారి వేసుకుంటుంటే ముఖం ఫ్రెష్ గా ఉంటుంది. ముల్తానా మట్టి, గంధం పొడి సమపాళ్ళలో కలుపుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.