భారత్ మహిళా క్రికెట్ జట్టు ఆదర్శం... బంగర్

SMTV Desk 2017-07-04 19:17:13  criket coach, bangar, women criketers, bharath, pakistan, champiyan trofy ,

ఆంటిగ్వా, జూలై 4 : ఈ మధ్య కాలంలో జరిగిన పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుపై భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మహిళా జట్టుపై సంజయ్ బంగర్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న బంగర్.. వరుసగా మూడు విజయాలు సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. ఈ సమయంలోనే వెస్టిండీస్ తో నాల్గో వన్డేలో ఓటమి పాలైన పురుషుల క్రికెట్ జట్టుకు బంగర్ చురకలంటించారు. భారత మహిళా క్రికెట్ జట్టును స్పూర్తిగా తీసుకోవాలంటూ విరాట్ సేనకు సూచించారు. ఈ మేరకు భారత మహిళా క్రికెట్ జట్టును వన్డే వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలతో భారత మహిళలు దుసుకుపోవడంతో ఈ మేరకు పాకిస్తాన్ పై భారత్ సాధించిన విజయం నిజంగా అద్భుతం. భారత మహిళలు 169 పరుగులు చేసినా బౌలింగ్ లో చెలరేగిపోయి పాకిస్తాన్ ను కట్టడి చేశారు. పాకిస్తాన్ తో భారత్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ సాధించడంలో విఫలమైన లోటును మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచి భర్తీ చేసింది. ఈ సందర్భంగా మన భారత్ మహిళా క్రికెటర్లు పురుష క్రికెటర్లకు ఆదర్శంగా నిలువడం గమనార్హం.