సమ్మర్ ఫేస్ ప్యాక్

SMTV Desk 2018-04-19 14:49:37  summer face pack, face pack beauty tips, hyderabad, summer season

హైదరాబాద్, ఏప్రిల్ 19 : వేసవి వచ్చిదంటే చాలు.. సూర్యుడి భగభగ ధాటికి చెమటతో శరీరం నిండిపోతుంది. మండే ఎండల మధ్య జిడ్డు చర్మం ఉన్న మహిళలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మృతకణాల తొలిగింపుకు తగిన చర్యలు తీసుకోవాలి. ముఖం మీదపేరుకున్న జిడ్డును తోలిగించుకోవాలి. మైల్డ్ మెడికేటెడ్ సబ్బుతో కనీసం రెండు సార్లు ముఖం కడుక్కోవాలి. నుదురు, ముక్కు, గడ్డంపై శ్రద్ధ చూపాలి. నెమ్మదిగా మసాజ్ చేస్తున్నట్లుగా సబ్బుతో రుద్దుకొని, చల్లని నీటితో కడిగేయాలి. ఆయిల్ స్కిన్ ఉన్న వారికి చర్మరంధ్రాలు మూసుకుపోయి, పోర్స్ ఏర్పడుతుంటాయి. ఈ సమస్య నివారణకు ముఖం శుభ్రం చేసుకున్నాక అస్త్రీమ్జెంట్ ఉపయోగించాలి. ముల్తానా మట్టి పావుస్పూన్, టమాటా గుజ్జు రెండు స్పూన్లు, పెరుగు రెండు స్పూన్లు, కీరారసం ఒక స్పూన్ కలిపి ముఖానికి రాసి పదిహేను ఇరవై నిముషాలు ఉంచాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు అయిన వేసుకోవడం మంచిది. వేసవిలో జిడ్డు చర్మమున్నవారు క్రీమ్ లేదా బేస్డ్ మేకప్ ఉత్పత్తులను వాడకూడదు. వాటర్ బేస్డ్ కాస్మోటిక్స్ క్రీములు లేదా పౌడర్ మేకప్ లనే వాడాలి. ముఖాన్ని రోజుకు చాలా సార్లు క్లీన్ చేసుకుంటుంటే సాధ్యమైనంత తక్కువ మేకప్ వేసుకోవాలి. జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ వాడాలి. నెలకోసారైన అనుభవం ఉన్న బ్యూటీషియన్ వద్దకు వెళ్ళాలి.