బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ టాప్ : ఫాల్క్‌నర్‌

SMTV Desk 2018-04-19 13:06:40  james faulkner, faulkner about srh, ipl-11, sun risers hyderabad

ముంబై, ఏప్రిల్ 19 : ఐపీఎల్-11 సీజన్ లో బౌలింగ్ పరంగా అత్యంత బలమైన జట్టు ఏది అంటే.. ఠక్కున గుర్తొచ్చే టీం సన్ రైజర్స్ హైదరాబాద్. భువనేశ్వర్‌, రషీద్‌ఖా యువ పేసర్‌ సిద్ధార్థ్‌కౌల్‌, పార్ట్‌టైమ్‌ బౌలర్లు దీపక్‌హుడా, మహమ్మద్‌ నబీలాంటి ఆటగాళ్లతో జట్టు బౌలింగ్ పటిష్టంగా ఉంది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ ఫాల్క్‌నర్‌ చెప్పాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బౌలింగ్‌ పరంగా చూసుకుంటే ఈ సీజన్లో టాప్ లో ఉందని అతను అభిప్రాయపడ్డాడు. "బౌలింగ్‌ పరంగా చూస్తే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ బలమైన జట్టు. గత కొన్ని సీజన్ల నుంచి భువనేశ్వర్‌ అద్భత ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి నా దృష్టిలో బౌలింగ్‌ పరంగా సన్‌రైజర్స్‌ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ టీ20 క్రికెట్లో ఉత్తమ మణికట్టు స్పిన్నర్‌ రషీద్‌ జట్టులో ఉన్నాడు" అని ఫాల్క్‌నర్‌ తెలిపాడు. ఇద్దరు డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌లు ఉండడంతో ముంబయి ఇండియన్స్‌ జట్టు రెండో స్థానంలో ఉందని అతను చెప్పాడు. "బుమ్రా, ముస్తాఫిజుర్‌ రూపంలో చివరి ఓవర్లలో గొప్పగా బౌలింగ్‌ చేయగల ఇద్దరు బౌలర్లు ముంబయి ఇండియన్స్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో వాళ్లది రెండో స్థానం" అని ఫాల్క్‌నర్‌ వెల్లడించాడు.