ముగిసిన రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ పర్యటన

SMTV Desk 2017-07-04 16:56:06  ramnath kovid, telangana, kcr, ministar,

హైదరాబాద్, జూలై 04: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ హైదరాబాద్ కు వచ్చిన విషయం తెల్సిందే, ఈ మధ్యాహ్నం హైదరాబాద్ జలవిహార్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెరాస లీడర్స్ తో కలిసి ఆయన సమావేశం అయ్యారు. తనకు మద్దతు తెలిపినందుకు కోవింద్ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ మాట్లాడుతూ తాను గవర్నర్ గా ఉన్నప్పుడు ఏ పార్టీ కోసం పనిచేయ్యలేదని అన్నారు. దేశాభివృద్ది కోసం తాను కృషి చేస్తానని, రాష్ట్రపతి కార్యాలయం ఎల్లప్పుడూ రాజకీయాలకు అతీతంగా పని చేస్తుందని తెలిపారు. తెలంగాణ సీఎం కెసిఆర్ కోవింద్ ను ఘనంగా సత్కరించారు. సంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందని చెబుతూ కెసిఆర్ ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఆపై వెండితో తయారు చేసిన చార్మినార్ ప్రతిమను బహూకరించారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ తదితరులకు శాలువాలు కప్పి సత్కరించారు. హైదరాబాద్ జ‌ల‌విహార్‌లో జరిగిన సమావేశం ముగించుకొని తిరిగి విజయవాడకు బయలుదేరిన రామ్‌నాథ్ కోవింద్‌కు బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తో మంత్రులు ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.