టాలీవుడ్ ఫైర్ అయిన జీవితా రాజశేఖర్

SMTV Desk 2018-04-17 21:04:10  jeevita rajasekhar, casting couch, tolly wood, hyderabad

హైదరాబాద్, ఏప్రిల్ 17 : టాలీవుడ్ ఇండస్ట్రీ పై సినీనటి జీవితా రాజశేఖర్ ఫైర్ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విషయంపై ఇంతా జరుగుతున్నా సినీ ప్రముఖులు స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.." నేను చాలా రోజులుగా మీడియాలో కాస్టింగ్ కౌచ్ వస్తున్న వార్తలను చూస్తున్నాను. చివరికి తట్టుకోలేక ఈ రోజు మిమ్మల్ని పిలిచాను. చిత్ర పరిశ్రమ నుండి ఏ ఒక్కరు మాట్లాడారు. ఇంతకు ముందు డ్రగ్స్ విషయంలో నేనే ముందు మాట్లాడాను. నేను అందరి సీనియర్ నటీనటులను బ్రతిమాలుతున్నాను. ఇప్పటికైనా మీ మౌనం వీడండి. ఈ విషయంపై జమున, జయసుధ, జయప్రద, విజయ నిర్మల స్పందించాలి" అని అన్నారు