అవినీతిని నిలదీసిన మహిళా పోలీస్ బదిలీ

SMTV Desk 2017-07-04 14:39:20  Social media, CI Sreesanthatha Thakur, police,Party leaders

న్యూఢిల్లీ, జూలై 4 : దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా యూపీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నఓ వీడియో మహిళా సీఐ శ్రేష్టా ఠాకూర్ కు సంబంధించినదన్న విషయం తెలిసిందే.. నిజాయితీ గల పోలీసులు గర్వపడేలా విధులు నిర్వర్తించిన ఈ మహిళా పోలీస్ గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలనే అరెస్ట్ చేయడంతో ఆమె నిజాయితీని దేశ ప్రజలంతా అభినందించారు. ఆమె ఈ మేరకు పోలీసులు పనిచేయాల్సింది ప్రజల కోసమని, పార్టీల కోసం కాదని ఈ భాద్యతను శ్రేష్టా నిరుపించారని కొనియాడారు. ఈ వ్యవహారం జరిగిన కొద్దిరోజులకే ఆమెను వేరే చోటుకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో యూపీ సీఎంపై, వారి స్థానిక పోలీసు అధికారులపై విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకుశ్రేష్టా ఠాగూర్ తన బదిలీ ఆదేశాలపై స్పందిస్తూ నేపాల్ బోర్డర్ కు సమీపంలో ఉన్న బరైచ్ కు తనను బదిలీ చేశారని, తన మంచి కోరుకునే మిత్రులు ఎవ్వరుకుడా బాధపడొద్దని తాను అక్కడ సంతోషంగానే ఉన్నట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. నిజాయితీగా మంచి విధులు నిర్వర్తించినందుకు తనకు దక్కిన బహుమానంగా బదిలీని ఆమె స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫేస్ బుక్ పోస్ట్ లో కాంతిని ఎక్కడ దాచినా.. తన వెలుగును వ్యాపింపజేస్తుందని, వెలుగునిచ్చే దీపానికి సొంత ఇల్లు అనేది ఉండదని శ్రేష్టా ఠాకూర్ తెలిపారు. ఆమె బదిలీపై స్పందించిన తీరును పలువురు హర్షం వ్యక్తపరిచారు.