పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్

SMTV Desk 2017-07-04 14:16:13  pawan kalyan, trivikram, venkatesh, anirudh, radhakrishna

హైదరాబాద్, జూలై 04 : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటిలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే అభిమానులు క్లైమాక్స్ భారీ ఎత్తున ఉండాలని కోరుకుంటారు. అయితే ఇది వరకు వచ్చిన సినిమా అత్తారింటికి దారేది, లో సరికొత్త డిజైన్ ని చిత్రీకరించారు. త్రివిక్రమ్ మాస్ కి కావల్సిన పోరాట దృశ్శలు ఉంటూనే ఈ సినిమాలో భావోద్వేదభరితమైన పతాక సన్నివేశాన్ని రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలయికలో ముచ్చటగా మూడో సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఈసారి ఫైటింగులతో పాటు మనసును హత్తుకొనే సంభాషణలను క్లెమాక్స్ ని రూపొందిస్తున్నారు. రవివర్మ నేతృత్వం లో పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. జూలై వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ షూటింగ్ కొనసాగించి. తరువాత వచ్చే నెలలో చిత్రబృందం యూరప్ వెళ్ళనుంది. అక్కడ కొన్ని పాటల్ని తెరకెక్కించనున్నారు. ఇందులో విక్టరి వెంకటేష్ అతిధి గా మేరువనున్నట్లు తెలుస్తుంది.