పోరాడి ఓడిన చెన్నై

SMTV Desk 2018-04-16 12:01:19  dhoni, chennai super kings, ipl, kings X1 punjab

మొహాలి, ఏప్రిల్ 16 : : పునరాగమనం.. ఘనం.. ఆడిన రెండు మ్యాచ్ ల్లో అద్భుత విజయం.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) అభిమానులకు ధోని జట్టు సూపర్ మజాను ఇచ్చింది. అదే ఉత్కంట నిన్న మొహాలి వేదికగా జరిగిన కింగ్స్ X1 పంజాబ్ తో జరిగిన మ్యాచ్ రీపీట్ అయ్యింది. కానీ ఫలితం మాత్రం మారిపోయింది. లక్ష్య ఛేదనలో చెన్నై సారథి ధోని ( 79 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4, 5×6) చివర వరకు పోరాడిన జట్టును గెలిపించాలేకపోయాడు. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 4 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది తొలి ఓటమి కాగా, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు రెండో విజయం. తొలుత టాస్ నెగ్గిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున తొలిసారి బరిలో దిగిన గేల్‌ (63), రాహుల్‌(37) తోడుగా రెచ్చిపోయాడు. ఒక దశలో భారీ స్కోర్ చేసే దిశగా కనిపించిన చెన్నై బౌలర్ల వరుస విరామాల్లో వికెట్ తీయడంతో 200 చేరువగా వెళ్లగలిగింది. చివర్లో కరుణ్‌ నాయర్‌ (29) ధాటిగా ఆడడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 197 పరుగులు చేసింది. భారీ ఛేదనలో చెన్నైకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు వాట్సన్‌ (11) , విజయ్‌ (12) విఫలమయ్యారు. గత మ్యాచ్ లో మెరుపులు మెరిపించిన బిల్లింగ్స్‌ (9) కూడా ఔట్‌ కావడంతో చెన్నై 56/3తో కష్టాల్లో పడింది. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (49) చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఆశ్విన్ సూపర్ త్రో కారణంగా రాయుడు రనౌట్ గా పెవిలియన్ కు చేరాడు. అక్కడి నుండి ధోని పోరాటం కొనసాగిన చివరికి చెన్నైకు పరాజయం తప్పలేదు. దీంతో చెన్నైనిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు క్రిస్ గేల్‌ ను వరించింది.