దాడులకు పాల్పడితే మూల్యం చెల్లించుకోవాలి : అమెరికా

SMTV Desk 2018-04-15 16:15:17  America vice president, mike pens, warning, siriya

వాషింగ్టన్‌, ఏప్రిల్ 15 : సిరియాలో మరోసారి రసాయన దాడులు చేయాలని ఆలోచిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అక్కడి పాలకులను అమెరికా హెచ్చరిచింది. తమ ఆయుధాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయని, ప్రజలను హింసించాలని చూస్తే తగిన పరిహారం చెల్లించుకుంటారని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ అన్నారు. సిరియా విషయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు సిరియాపై బ్రిటన్‌, ఫ్రాన్స్‌లతో కలిసి చేపట్టిన బాంబు దాడులు విజయవంతమైనట్లు అమెరికా రక్షణ కేంద్ర కార్యాలయం పెంటగాన్‌ ప్రకటించింది. కచ్చితమైన లక్ష్యంతో చేసిన దాడులు విజయవంతమైనట్లు తెలిపింది. మూడు రసాయన ఆయుధ స్థావరాలు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. దీనికోసం 105 క్షిపణులను‌ వినియోగించినట్లు వెల్లడించింది. ఈ దాడులకు వ్యతిరేకంగా సిరియా కూడా దాడులు చేసిందని, 40 వరకు క్షిపణులను ప్రయోగించి విఫలమైందని చెప్పింది. వీటిలో ఏ ఒక్కటీ అమెరికా దళాల సమీపానికి చేరుకోలేకపోయాయని అని అమెరికా తెలిపింది.