కోహ్లికి అనుష్క ఫ్లయింగ్‌ కిస్సెస్‌..

SMTV Desk 2018-04-14 18:23:35  kohli, anushka flying kiss, royal challengers bangalore, virat kohli

బెంగళూరు, ఏప్రిల్ 14 : బాలీవుడ్ ముద్దుగుమ్మ, విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ ఐపీఎల్‌లో సందడి చేసింది. శుక్రవారం చిన్నస్వామి స్డేడియంలో జరిగిన బెంగళూరు-పంజాబ్‌ మ్యాచ్‌కు అనుష్క హాజరయ్యారు. మ్యాచ్‌ మొత్తం ఆమె తన భర్త, బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఒక దశలో మైదానంలో ఉన్న కోహ్లి కోసం అనుష్క ఫ్లయింగ్‌ కిస్సెస్‌ పంపించారు. దీంతో గ్రౌండ్‌లో వాతావరణం ఒకింత ప్రేమభరితంగా మారిపోయింది. మ్యాచ్‌లోని ఓ దశలో కోహ్లి క్యాచ్‌ అందుకోవడంతో ఆనంద డొలికల్లో తేలిపోయిన అనుష్క గాలిలో తన భర్తకు ముద్దులు విసురుతూ కనిపించారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ను ఓడించి.. సొంత మైదానంలో విజయంతో ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు బోణీ కొట్టింది. అంతేకాదు మ్యాచ్‌ అనంతరం గ్యాలరీలో కూర్చుని ఉన్న అనుష్కకు కోహ్లీ ఫోన్‌ చేసి రమ్మంటూ పిలిచిన ఓ వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.