నేడు అంబేద్కర్‌ 127వ జయంతి

SMTV Desk 2018-04-14 14:00:15  Ambedkar Jayanti, 127 th Ambedkar Jayanti, new delhi, untouchability

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రస్తుత సమాజంలో అంటరానితనం నయం చేయలేని వ్యాధిగా మారింది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు లాంటి మందులు పెట్టిన ఈ వ్యాధిని తగ్గించలేకపోతున్నాయి. అగ్రకులాల నియంతృత్వ ధోరణిని అరికట్టేందుకు అణగారిన వర్గాల ఆశాదీపంగా మారిన రాజ్యంగా పిత నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 127వ జయంతి ఈ రోజు. ఎన్నో అవమానాలు తట్టుకొని, బాధలను భరించి, నిమ్నవర్గాలపై జరుగుతున్నా దాడులకు విసిగిపోయిన అంబేద్కర్‌ దేశపాలనా వ్యవస్థలో దళితులకు ప్రాతినిధ్యం ఉండటం అవసరమని భావించారు. నేడు ఎస్సీ, ఎస్టీ లకు పలు చట్టాలు నిబంధనలు అండగా నిలుస్తున్నాయంటే దానికి కారణమే ఆయనే. అయితే ఆయన రూపొందించిన ఈ చట్టాలు అమలులో మాత్రం నీరుగారిపోతున్నాయి. తాజాగా సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంకు కొన్ని సవరణలు చేయాలనీ భావించింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని దళిత వర్గాలను ఆదుకొనే దిశగా కసరత్తులు చేస్తే అంబేద్కర్‌ ఆశయం నిజమైనట్లే.