పవన్ నల్ల కళ్ళజోడు రహస్యం..!

SMTV Desk 2018-04-14 13:02:06  pawan kalyan, rangasthalam success meet, black Spects secret.

హైదరాబాద్, ఏప్రిల్ 14 : "రంగస్థలం" విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సినిమా వేడుకలంటేనే ఆమడ దూరంలో ఉండే పవన్.. ఈ మధ్య కాలంలో సినిమా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తాజాగా.. "రంగస్థలం" సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. అయితే ఈ వేడుకకు పవన్.. నల్లకళ్లద్దాలతో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. పవన్‌ నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకున్నారా? అని అందరికీ సందేహం వచ్చే ఉంటుంది. అందుకు గల కారణాన్ని కూడా పవన్‌ ఆ వేదికపైనే చెప్పేశారు! "నేను కళ్లద్దాలు పెట్టుకోవడానికి ఓ కారణం ఉంది. నా కళ్లపై వెలుగు పడకూడదు. చిన్న ఐ ప్రాబ్లమ్ వచ్చింది. అంతేకానీ స్టయిల్ కోసం మాత్రం కాదు" అన్నారు. పవన్ అలా చెప్పేసరికి అభిమానుల ఈలలు, అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది.